

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’పై అంచనాలు పెరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇటీవల ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘జయ జయ రామ్’ తొలి పాటను విడుదల చేశారు. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ భక్తి గీతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
దీపావళి కానుకగా ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కేజీఎఫ్ స్టార్ యశ్, నమిత్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇంగ్లిష్ వెర్షన్ రన్‌టైమ్‌పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లిష్ వెర్షన్‌ను దాదాపు 30 నిమిషాలు తగ్గించి, కొన్ని పాటలు మరియు సన్నివేశాలను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ మార్పులు చేశారనే ప్రచారంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!