

అండర్-19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో అర్జున్ రాజ్‌పుత్ అద్భుతంగా ఆడి 85 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. కావ్య పటేల్ 23 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నిఖాబ్ షఫీక్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు 48.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ హమ్జా జహూర్ అజేయంగా 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హస్నైన్ దార్ 38 పరుగులతో అతడికి సహకరించాడు. భారత బౌలర్లలో మనల్ చౌహాన్ మూడు వికెట్లు, మోహిత్ ఉల్వా రెండు వికెట్లు తీశారు. చివరకు పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!