

ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 రేటింగ్ పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు 113 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు 102 పాయింట్లతో టాప్-4లోకి దూసుకెళ్లగా, పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది.
శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు, అఫ్గానిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు, వెస్టిండీస్ క్రికెట్ జట్టు తదుపరి స్థానాల్లో నిలిచాయి. గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించినట్లు ఐసీసీ తెలిపింది. మే 2025 తర్వాత జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీ ఇచ్చింది. ఇదే సమయంలో 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్లో మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడగా, ప్రతి గ్రూపు నుంచి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!