

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని తెలిపారు. వారణాసిలో జరిగిన 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, గత పదేళ్లలో భారత్ 20కిపైగా అంతర్జాతీయ క్రీడా పోటీలకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిందన్నారు. ఫిఫా అండర్-17 వరల్డ్కప్, హాకీ వరల్డ్కప్, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణలని చెప్పారు.
2030లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే నిర్వహించనున్నట్టు ప్రధాని గుర్తుచేశారు. వాలీబాల్ ఆటను భారత్ అభివృద్ధి ప్రయాణంతో పోల్చిన ఆయన, ఏ విజయం అయినా జట్టు సమన్వయం, విశ్వాసం, బాధ్యతలపై ఆధారపడి ఉంటుందన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికిపైగా క్రీడాకారులు పాల్గొంటుండగా, ఈ పోటీలు వారణాసిని జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కేంద్రంగా మార్చనున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.




.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!