

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ వీరోచిత బ్యాటింగ్‌తో పాటు భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) కీలక పరుగులు జోడించారు. పాక్ తరఫున సైమ్ అయూబ్ మూడు వికెట్లు సాధించాడు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల ధాటికి నిలువలేక 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా సాహిబ్జాదా ఫర్హాన్‌ను డకౌట్ చేయగా, జస్ప్రీత్ బుమ్రా టాప్ ఆర్డర్‌ను కుదిపేశాడు. మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వరుస వికెట్లు తీసి పాక్‌పై ఒత్తిడి పెంచారు. ఉస్మాన్ ఖాన్ (44) మాత్రమే కొంత పోరాడగా, భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత ఇన్నింగ్స్‌కు గాను ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతూ సూపర్-8 దశకు చేరువైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!