

జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు ఘనంగా దూసుకెళుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే దూకుడు మీద ఉన్న టీమ్ ఇండియా, మంగళవారం స్విట్జర్లాండ్ పై 5-0 తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఇదే గ్రూప్‌లో భారత్ ముందు చిలీ, ఒమన్ జట్లను కూడా సునాయాసంగా ఓడించింది. ఆ విజయం జోరునే స్విట్జర్లాండ్ పై కూడా కొనసాగించింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే మన్మీత్ గోల్ చేసి జట్టుకు మంచి స్టార్ట్ ఇచ్చాడు. 11 వ నిమిషంలో మరో గోల్ చేస్తూ భారత్ ఆధిక్యాన్ని మరింత బలపరిచాడు.
ఆ వెంటనే 13 వ నిమిషంలో శారదానంద్ గోల్ చేసి స్కోర్ ను 3-0 కు తీసుకెళ్లాడు. తర్వాత అర్ష్‌దీప్ చేసిన గోల్‌తో భారత్ ఆధిక్యం 4-0 కు చేరింది. ఒత్తిడిలోకి నెట్టబడిన స్విట్జర్లాండ్ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరి దశలో ఆరు నిమిషాల ముందు శారదానంద్ మరో గోల్ చేసి భారత్ విజయం 5-0 తో ఖరారు చేశాడు.
ఇప్పుడు భారత్ ఈ నెల 5 న జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో బెల్జియంతో తలపడనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!