
గాసిప్స్

2026 లో నమీబియా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న ICC అండర్-19 వరల్డ్ కప్‌కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు జరగనుంది. భారత జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా, విహాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో సంచలనంగా వార్తల్లో నిలిచిన 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం లభించింది.
భారత్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 15 న USA తో ఆడనుంది. ఈ టోర్నమెంట్ లో భారత్ గ్రూప్-A లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, USA జట్లతో కలిసి పోటీపడనుంది. ఇప్పటికే అండర్-19 వరల్డ్ కప్‌ను రికార్డు స్థాయిలో ఐదు సార్లు గెలుచుకున్న భారత్, ఈసారి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!