
సినిమాలు

వడోదర వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే జట్టు 39.5 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ వైష్ణవి శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 39 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి జింబాబ్వే బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. ప్రతికా రావల్ అర్ధసెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బ్యాటర్లు సమర్థంగా ఆడటంతో జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత్ సిరీస్‌ను ఘనంగా ముగించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!