
జనరల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎదురుదెబ్బ తగిలింది. కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుని వన్డే క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆటగాళ్ల తాజా ప్రదర్శనల ఆధారంగా విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అగ్రస్థానాల్లో నిలవడం విశేషం. గిల్, కోహ్లీ, రోహిత్ ముగ్గురూ ప్రపంచ టాప్ బ్యాటర్ల జాబితాలో కొనసాగుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!