

అమెరికా నిఘా వ్యవస్థపై జరిగినట్లు వస్తున్న సైబర్ దాడి వార్తలు భద్రతా విభాగాల్లో కలకలం రేపుతున్నాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కు సంబంధించిన వ్యవస్థలతో పాటు సోషల్ మీడియా, శాటిలైట్ సమాచార వ్యవస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI) కార్యాలయంపైనా ఈ దాడి ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి రహస్య నిఘా సమాచారం లీక్ కాలేదని అమెరికా వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ సైబర్ దాడికి పాల్పడినవారు ఎవరు, ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఎలా చొరబడ్డారనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల FBI క్రైమ్ డేటాబేస్‌పై కూడా హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పెంటగాన్, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలపైనా సైబర్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస దాడులతో అమెరికా నిఘా, భద్రతా వ్యవస్థల సైబర్ రక్షణ సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!