
సినిమాలు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ మెన్స్ పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్‌లో ఈగల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎనిమిది మంది హాస్టల్ నివాసితులకు డ్రగ్ టెస్టులు చేశారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పీజీ హాస్టళ్లలో డ్రగ్స్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్ల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన వివరాలపై అధికారులు మరిన్ని తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!