
జనరల్

భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పుపై నెలకొన్న వివాదానికి హాకీ ఇండియా మరోసారి వివరణ ఇచ్చింది. నీలి రంగులో ఉండే హాకీ టర్ఫ్‌లపై ఆటగాళ్లు స్పష్టంగా కనిపించేందుకు భిన్నమైన రంగును ఎంచుకున్నామని, అందులో భాగంగానే జెర్సీలను కాషాయ రంగులోకి మార్చామని హెచ్‌ఐ పేర్కొంది.
అయితే ఈ మార్పుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రంగును క్రీడాకారులపై రుద్దుతున్నారనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తొలుత జెర్సీ మార్పును సమర్థించిన హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, ఆ తర్వాత ఈ నిర్ణయ ప్రక్రియపై తనకు పూర్తి సమాచారం లేదని చెప్పడంతో చర్చ మరింత పెరిగింది. దీనిపై వివరణ కోరగా డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కే శ్రీవాస్తవ నాలుగు పేజీల సమాధానం పంపారు. కార్యవర్గ సభ్యుల ఆమోదంతోనే జెర్సీ రంగు మార్పు నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!