
జనరల్

జింబాబ్వేలో జరిగిన మాస్వింగో 50 ఓవర్ల ఫస్ట్ లీగ్ టోర్నీలో స్కార్పియన్స్ క్రికెట్ క్లబ్ చరిత్ర సృష్టించింది. 50 ఓవర్లలో ఏకంగా 822/4 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఓపెనర్ తకుండ మడెంబో 143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్సర్లతో 302 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ విన్ఫెడ్ కేవలం 75 బంతుల్లోనే 23 ఫోర్లు, 13 సిక్సర్లతో 203 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. గాబ్రియెల్ కూడా 49 బంతుల్లో 110 పరుగులతో మెరిపించాడు.
822 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెథానె లయన్స్ జట్టు 28/7 స్కోరుకే పరిమితమై 794 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 108 ఎక్స్‌ట్రాలు నమోదవడం విశేషం. స్కార్పియన్స్ బ్యాటర్లు సృష్టించిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!