
జనరల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడి నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అంబుడ్స్మన్ ఆదేశాల మేరకు జరిగిన ప్రస్తుత అధ్యక్షుడి నియామకం చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో హెచ్సీఏ వ్యవహారాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
కోర్టు ఆదేశాల ప్రకారం అంబుడ్స్మన్ నిర్ణయంతో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమర్నాథ్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (Special AGM) నిర్వహించి, నిబంధనల ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను చేపట్టాలని హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!