25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

Writer: Chandrika 11:56 PM, 24 అక్టోబర్, 2026
బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో 48వ రోజు శనివారం ఎపిసోడ్‌ వాడీవేడిగా సాగింది. ఇంటి సభ్యుల ప్రవర్తన, ఆటతీరుపై హోస్ట్‌ నాగార్జున్‌ ఒక్కొక్కరినీ ప్రశ్నించారు. ముందుగా ఆటలో బాగా ఆడిన నరేశ్‌, శివ కుమార్‌, నీతూ, అమన్‌లను అభినందించారు. ఆ తర్వాత ముకేష్‌, వర్షిణి, షాలిని, త్రిగుణ్‌, రోహిత్‌ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు.

శివ కుమార్‌తో జరిగిన గొడవలో ముకేష్‌ గౌడ మాట్లాడిన తీరు, నీతూతో అతడు ప్రవర్తించిన విధానంపై నాగార్జున్‌ ప్రశ్నలు సంధించారు. శివ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇదే ప్రవర్తన కొనసాగితే ఆటలో అతడి పరిస్థితి దెబ్బతింటుందని హెచ్చరించారు. మరోవైపు నీతూను ఉద్దేశించి వర్షిణి చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున్‌ స్పందించారు. నీతూను ప్రశ్నించిన వర్షిణి, టాస్క్‌లో కనీసం 12 కిలోల బరువును కూడా ఎత్తలేకపోయిందని వ్యాఖ్యానించారు.

షాలిని తిరిగి హౌస్‌లోకి రావడం తనకు ఇష్టం లేదని రాంప్రసాద్‌ చెప్పడంతో చర్చ మొదలైంది. రెండో అవకాశం వచ్చినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో షాలిని భావోద్వేగానికి గురై ఏడ్చింది. అనంతరం నాగార్జున్‌ ఆమెను ప్రశ్నిస్తూ, దక్షి, దేబ్జానీలతో జరిగిన వివాదాలు, బిగ్‌బాస్‌ గతంలో ఇచ్చిన హెచ్చరికలకు సంబంధించిన వీడియోలను చూపించారు. తన తప్పు ఉంటే హౌస్‌ నుంచి వెళ్లిపోతానని షాలిని చెప్పడంతో నాగార్జున్‌ గేట్లు తెరిపించారు. అయితే, రోహిత్‌, ఇతర సభ్యులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. చివరకు షాలిని తన నిర్ణయాన్ని మార్చుకుని, తప్పులు మళ్లీ చేయనని చెబుతూ నాగార్జున్‌కు క్షమాపణలు చెప్పింది.

రోహిత్‌ను ఉద్దేశించి అనుచిత పదాలు ఉపయోగించిన త్రిగుణ్‌పైనా నాగార్జున్‌ చర్యలు తీసుకున్నారు. అతడికి జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రోహిత్‌ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఇచ్చారు. హౌస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్‌ అయ్యే అవకాశంతో పాటు కెప్టెన్సీ పోటీదారుగా నిలిచే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రోహిత్‌ ఆందోళనకు గురై, తన ఆటపై ప్రభావం పడుతుందని చెబుతూ శిక్షను తగ్గించాలని నాగార్జున్‌ను వేడుకున్నాడు.

అనంతరం ఇంటి సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న నాగార్జున్‌.. రోహిత్‌కు విధించిన కెప్టెన్సీ సంబంధిత శిక్షను రెండు వారాలకు తగ్గించారు. హెచ్చరికలు, వాదనలు, కన్నీళ్లు, శిక్షలతో ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ సాగింది. సభ్యుల ప్రవర్తనపై హోస్ట్‌ తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లోని సమీకరణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?

బిగ్‌బాస్‌ 10: ముకేష్‌ గౌడకు నాగార్జున గట్టి క్లాస్‌...

బిగ్‌బాస్‌ 10: ముకేష్‌ గౌడకు నాగార్జున గట్టి క్లాస్‌...

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ  గొడవ

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ గొడవ

బిగ్ బాస్ తెలుగు 10:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ సీజన్‌ 1048వ రోజు ఎపిసోడ్‌నాగార్జున్‌షాలినిత్రిగుణ్‌రోహిత్‌ముకేష్‌ గౌడరాంప్రసాద్‌బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు
జనరల్

ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!
షోస్

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్
జనరల్

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ
జనరల్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు
ఆరోగ్యం

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత
ఆరోగ్యం

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
సినిమాలు

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్
సినిమాలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.
జనరల్

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!