

నోటిపూత.. ఈ పేరు వింటేనే కొందరు భయపడిపోతారు. ఒక్కసారి అది వస్తే తినడానికి, తాగడానికి ఇంకా మాట్లాడడానికీ కష్టపడాల్సి వస్తుంది. నోటిపూత వల్ల నొప్పి కూడా కలుగుతుంది. సాధారణంగా ఈ సమస్య కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తగ్గకుండా వారాల తరబడి ఇబ్బంది పెడుతుంది. పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల నోటిపూతలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. అవి ఏంటో తెలుసా..?
ఉప్పునీరు: నోటిపూతను నయం చేయడంలో ఉప్పునీరు సహాయపడుతుంది. ఇందుకోసం ఉప్పునీటిని రోజూ పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది.
తేనె: తేనెను నోటిపూత ఉన్న ప్రదేశంలో పూయడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. అయితే ఇలా చేయడం వల్ల మంటగా, చికాకుగా అనిపిస్తే తేనె పూయడాన్ని ఆపేయాలి.
ఆహారపు అలవాట్లు: నోటిపూతతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మసాలా, ఉప్పు, పులుపు, కరకరలాడే ఆహారాలు తినడం వల్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి మెత్తటి ఆహారాలు తినడం ఉత్తమం. ఇలాంటి సందర్భాల్లో నీరు ఎక్కువగా తాగండి.
కొన్నిసార్లు ఐరన్, విటమిన్ బీ12 లోపం వల్ల నోటిపూతలు వస్తాయి. అలాగే ఈ పూతలకు ఇతర కారణాలూ ఉండొచ్చు. అయితే ఇవి రెండు వారాలైన తగ్గకున్నా, పదేపదే వస్తున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!