25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

Writer: Chandrika 11:48 PM, 24 అక్టోబర్, 2026
ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాలిఫోర్నియాలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేష్ టాండన్ తన సొంత పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాలిఫోర్నియాలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ట్రంప్ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు టాండన్ పోటీ చేస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీ రో ఖన్నా.. టాండన్ ప్రత్యర్థి. ఓ వార్తా సంస్థతో టాండన్ మాట్లాడారు. ట్రంప్ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని, వడ్డీ రేట్లు అధికమయ్యాయని, జీవన వ్యయం పెరిగిందని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

అమెరికా తన ప్రత్యర్థి దేశాలతో పాటు మిత్రదేశాలపైనా భారీ సుంకాలు విధించడాన్ని టాండన్ తప్పుబట్టారు. ‘ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రస్తుతం బే ఏరియాలోనే కాకుండా అమెరికా అంతటా ధరలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. గతంలో ఇల్లు కొనడానికి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు 4 నుంచి 5 శాతం మధ్య ఉండేవి. ఇప్పుడు అవి 7.5 శాతానికి చేరాయి. గ్యాస్ ధరలు కూడా పెరిగాయి’ అని టాండన్ అన్నారు.


ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించడం వల్ల అమెరికాలో చమురు ధరలు పెరిగాయని, దాని ప్రభావం ఇతర వస్తువులపైనా పడిందని టాండన్ అన్నారు. ‘గతంలో డీజిల్ ధర 3 నుంచి 4 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు అది 8 నుంచి 9 డాలర్లకు చేరింది. డీజిల్ ధర పెరగడంతో సరుకుల రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో రోజువారీ సంపాదనతో జీవిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని టాండన్ పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని టాండన్ హామీ ఇచ్చారు.


తనను గెలిపిస్తే అమెరికా వలస విధానాల్లో కూడా సంస్కరణలు తీసుకువస్తానని టాండన్ హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డు విషయంలో దేశాల వారీగా విధించే కోటాలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కోటాల వల్ల భారతీయులు ఎక్కువగా నష్టపోతున్నారని, భారతీయులు గ్రీన్ కార్డు కోసం దాదాపు 20 ఏళ్లు వేచి చూడాల్సి వస్తోందన్నారు. అదే సమయంలో యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తెల్లజాతి వారికి ఆరు నెలల్లోనే గ్రీన్ కార్డు లభిస్తోందన్నారు. ‘ఇద్దరూ ఒకేరకమైన పని చేస్తున్నారు, ఒకేవిధంగా పన్నులు చెల్లిస్తున్నారు. అయినా భారతీయులు గ్రీన్ కార్డు కోసం 20 ఏళ్లు వేచిచూడాలా? దేశాల వారీగా ఉన్న కోటాలే దీనికి కారణం. నేను ఎన్నికైతే ఆ కోటాలను తొలగించేందుకు ప్రయత్నిస్తా’ అని టాండన్ అన్నారు. తనను గెలిపిస్తే, ధరల తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తానని టాండన్ హామీ ఇచ్చారు. కొత్త ఆవిష్కరణలు, పిల్లలకు ఏఐ విద్య అందించడంపై దృష్టి పెడతామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

ట్యాగ్లు
అమెరికామధ్యంతర ఎన్నికలుకాలిఫోర్నియారిపబ్లికన్ పార్టీరితేష్ టాండన్అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు
జనరల్

ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!
షోస్

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్
జనరల్

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ
జనరల్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు
ఆరోగ్యం

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత
ఆరోగ్యం

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
సినిమాలు

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్
సినిమాలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.
జనరల్

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!