

హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తాజాగా జట్టుకు దూరంగా ఒంటరిగా నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. దీంతో మేనేజ్మెంట్ చెబుతున్న గాయాల కారణం నిజమేనా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో అతడి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో పలువురు ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
మరోవైపు హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై కూడా ఊహాగానాలు పెరుగుతున్నాయి. వచ్చే సీజన్లో ముంబయి ఇండియన్స్ భారీ మార్పులు చేసే అవకాశం ఉందని, కెప్టెన్సీ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా లేదా సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి వ్యక్తిగత వివాదాలు, బీసీసీఐ మార్గదర్శకాల నేపథ్యంలో హార్దిక్ పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. భవిష్యత్తులో అతడు ముంబయి ఇండియన్స్‌ను వీడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!