
ఆరోగ్యం

ఐపీఎల్ ట్రేడింగ్ వ్యవహారంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ట్రేడింగ్ ఏదైనా సరే పూర్తి పారదర్శకతతో జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్ ప్రక్రియలో స్పష్టత ఉంటేనే అన్ని వర్గాల్లో జవాబుదారీతనం ఉంటుందని గవాస్కర్ పేర్కొన్నారు.
ఐపీఎల్ ట్రేడింగ్‌కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడకముందే ఊహాగానాలు, అపోహలు ప్రచారం చేయడం సరికాదని గవాస్కర్ సూచించారు. వాస్తవాలను నిర్ధారించకుండా లేనిపోని ప్రచారం చేయడం వల్ల అభిమానుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వ్యవహారాల్లో అధికారిక సమాచారం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!