

చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బందరు రోడ్డులోని హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, బుల్లితెర నటుడు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై, టోర్నమెంట్ జెర్సీలను లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక P4 నమూనా స్ఫూర్తితో ఈ లీగ్ నిర్వహించటం అభినందనీయమన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైనికుల సంక్షేమానికి చామల ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఈ సీజన్లో పాల్గొనే రాజకీయ జట్టు విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ సేవా దృక్పథంతో క్రీడలను ప్రోత్సహించటం గొప్ప విషయమన్నారు. చామల ఫౌండేషన్ ఛైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది హైదరాబాద్లో సీజన్-1 విజయవంతమైందని, ఇప్పుడు విశాఖలో ఆరు జట్లతో సీజన్-2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను సైనికుల సంక్షేమం, పేద కుటుంబాల అభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు.
పాల్గొనే జట్లు: ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, టాలీవుడ్ థండర్స్, బుల్లితెర రేంజర్స్, మీడియా మాస్టర్స్, శిరి ఇన్ఫో మిస్సైల్స్, పోలీస్ లయన్స్










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!