
జనరల్

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలు-2025ను ప్రకటించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సంస్థలను గుర్తించి ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను అందజేస్తారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల ఆధారంగా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేశారు.
అర్జున అవార్డుల విభాగంలో తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్, షట్లర్ గాయత్రి గోపీచంద్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. గత నాలుగేళ్లలో క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అర్జున అవార్డులను ప్రదానం చేస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!