

బిగ్‌బాస్ తెలుగు 10 ఇంట్లో బీబీ హోటల్ టాస్క్ వినోదభరితంగా సాగుతోంది. ఈ టాస్క్‌లో రెడ్ జోన్ సభ్యులు హోటల్ సిబ్బందిగా, ఎల్లో జోన్ సభ్యులు యజమానులుగా, గ్రీన్ జోన్ సభ్యులు అతిథులుగా వ్యవహరిస్తున్నారు. మొదటి ఛాలెంజ్‌లో రోహిత్, వర్షిణి విజయం సాధించడంతో బిగ్‌బాస్ వారికి రూ.2,000 నగదుతో పాటు ఒక స్టార్‌ను అందించాడు. వర్షిణి స్టార్‌ను తన వద్ద ఉంచుకుని, నగదును రోహిత్‌కు ఇచ్చింది. మరోవైపు, స్టార్‌లను నగదుతో మార్చుకునే ఆలోచనతో త్రిగుణ్ సహా కొందరు కంటెస్టెంట్లు టాస్క్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో నరేష్ తన మిమిక్రీ, చమత్కారమైన మాటలతో ఇంట్లో నవ్వులు పూయించాడు. త్రిగుణ్ అడిగినట్లుగా జంతువుల శబ్దాలను అనుకరిస్తూ సరదా కామెడీ చేశాడు. శ్వేతను కోతితో, వర్షిణిని నెమలితో, రాం ప్రసాద్‌ను గాడిదతో పోలుస్తూ పంచులు వేయగా, రాం ప్రసాద్ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. అనంతరం త్రిగుణ్, అమన్‌లతో కలిసి వెంట్రిలోక్విజం తరహా కామెడీతో అలరించాడు. మరోవైపు రెడ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు తదుపరి ఛాలెంజ్‌లలో గెలవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!