
జనరల్

ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో ఐదు వందలకు పైగా పరుగులు రెండు సార్లు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. కేఎల్ రాహుల్ గత కొన్ని సీజన్లుగా అద్భుతమైన స్థిరత్వంతో పరుగులు సాధిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నారు.
రాహుల్ 2018 నుంచి 2022 వరకు వరుస సీజన్లలో భారీ పరుగులు నమోదు చేశారు. అనంతరం 2024, 2025, 2026 సీజన్లలో కూడా ఐదు వందలకు పైగా పరుగులు చేసి మరోసారి తన నిలకడను నిరూపించారు. ఆయన ఆటతీరు, సమయోచిత బ్యాటింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ స్థిరత్వానికి కేఎల్ రాహుల్ నిదర్శనమని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!