

చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ కేవలం 23 బంతుల్లో 65 పరుగులు చేసి మ్యాచ్ను చెన్నై వైపు తిప్పేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో ప్రశాంత్ వీర్, శివం దూబే సిక్సర్ల వర్షంతో చెన్నైకి విజయం అందించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 85 పరుగులతో మెరిశాడు. షాదాబ్ అహ్మద్, హిమ్మత్ సింగ్ చివర్లో వేగంగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అయితే చెన్నై బౌలర్లు ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ కీలక వికెట్లు తీశారు. ఈ విజయంతో చెన్నై 12 పాయింట్లతో టాప్-5లోకి చేరగా, 11 మ్యాచ్ల్లో ఎనిమిది ఓటములతో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!