

యార్కర్లు, బౌన్సర్లు, అద్భుతమైన వేగంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రాకు IPL 2026 సీజన్ మాత్రం భిన్నంగా మారింది. ముంబయి ఇండియన్స్ తరఫున 13 మ్యాచులు ఆడిన బుమ్రా 8.37 ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఏ మ్యాచ్‌లోనూ రెండు వికెట్ల మార్క్ అందుకోలేకపోవడంతో అతడి బౌలింగ్ యావరేజ్ 102.50గా నమోదైంది.
అయితే గణాంకాలు బుమ్రా అసలైన ప్రభావాన్ని చూపలేవని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో రిస్క్ తీసేందుకు బ్యాటర్లు భయపడ్డారని, అతడిని జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యారని అభిప్రాయపడుతున్నారు. ఇతర బౌలర్లు పరుగులు సమర్పించిన సమయంలో బుమ్రా మాత్రం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతూ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. వికెట్లు తక్కువ వచ్చినా అతడి బౌలింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని అభిమానులు చెబుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!