

వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఇండియా, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మ్యాచ్ తర్వాత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా, అది భౌతిక ఘర్షణగా మారింది. ఆగ్రహంతో సహనం కోల్పోయిన వైభవ్ ఒక శ్రీలంక ఆటగాడిని తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో చివరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.
క్రికెట్‌లో భౌతిక దాడులు ఐసీసీ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, వైభవ్‌పై చర్యలు తీసుకునే అంశంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటగాళ్లు టోర్నమెంట్‌పైనే దృష్టి పెట్టారని, అతని ఫామ్‌పై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ట్రై సిరీస్‌లో వైభవ్ ఇప్పటివరకు 14, 44, 21 పరుగులు చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!