

ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకున్న సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై స్మార్ట్ సన్‌గ్లాసెస్, స్మార్ట్ గాగుల్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
బీసీసీఐ విడుదల చేసిన సూచనల ప్రకారం ఈ పరికరాల్లో లైవ్ ప్రసారం, సందేశాల పంపకం, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ పరికరాలను ఆడియో, వీడియో రికార్డింగ్ పరికరాలుగా కూడా ఉపయోగించే అవకాశం ఉండటంతో భద్రతాపరమైన ప్రమాదాలు తలెత్తవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
మ్యాచ్ రోజులలో స్టేడియంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్‌ను భద్రతా అధికారుల వద్ద జమ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రోమీ భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు హెచ్చరిక కూడా జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!