

ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషులు, మహిళల కబడ్డీ జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. గురువారం గ్రూప్-ఎలో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు చైనీస్ తైపీపై 37-21తో ఘన విజయం సాధించింది. ఇది టోర్నీలో భారత్‌కు వరుసగా నాలుగో గెలుపు. దీంతో గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ విజయంతో భారత పురుషుల జట్టుకు పతకం కూడా ఖరారైంది.
మహిళల విభాగంలోనూ భారత్ అదే జోరును కొనసాగించింది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో జపాన్‌ను 50-25తో చిత్తు చేసింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన ఇరు భారత జట్లు సెమీఫైనల్‌కు చేరడంతో పతకాలు ఖాయమయ్యాయి. నాకౌట్ దశలోనూ ఇదే జోరు కొనసాగించి స్వర్ణ పతకాలను నిలబెట్టుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!