
క్రీడలు

భారత షట్లర్ అస్మితా చాలిహా మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ఫైనల్లో ఆమె 21-13, 21-16 తేడాతో మలేసియాకు చెందిన గో జిన్ వీపై సునాయాస విజయం సాధించింది.
అయితే మరో భారత క్రీడాకారిణి మాళవికా బన్సోడ్ రౌండ్ 16లో ఓటమి పాలైంది. అలాగే దేవిక సిహాగ్ టాప్ సీడ్ చెన్ యూఫీ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలు కూడా ప్రీక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!