

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత బ్యాటింగ్‌తో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. అభిషేక్ కేవలం 38 బంతుల్లో 113 పరుగులతో సెంచరీ సాధించగా, వైభవ్ 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వీరిద్దరి వేగవంతమైన బ్యాటింగ్‌తో భారత్ 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రత్యేక సంభాషణలో వైభవ్ తన బ్యాటింగ్ విధానం గురించి వివరించాడు. గత మ్యాచ్‌లో తన సహజమైన ఆటతీరుకు భిన్నంగా నెమ్మదిగా ఆడానని, ఈసారి తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనిపై అభిషేక్ స్పందిస్తూ, వైభవ్ వేగంగా పరుగులు సాధించడం వల్ల ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరిగిందని తెలిపాడు. అతడి దూకుడు తనకు కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అనుకూల పరిస్థితులు కల్పించిందని పేర్కొన్నాడు. తన సెంచరీ వెనుక వైభవ్ పాత్ర కూడా ఉందని అభిషేక్ ప్రశంసించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!