

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ స్టార్ హ్యారీ కేన్ ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడికి అందించే ప్రతిష్ఠాత్మక బాలన్‌డోర్ అవార్డును గెలుచుకున్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఇంగ్లాండ్ జట్టు, తన క్లబ్ బేయర్న్ మ్యూనిక్ తరఫున ఆడుతూ 65 మ్యాచ్‌ల్లో 73 గోల్స్ సాధించినట్లు కథనం పేర్కొంది. ఓటింగ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాపె, స్పెయిన్ ఆటగాడు లామిన్ యమాల్, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీలను వెనక్కి నెట్టి కేన్ ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు తెలిపింది. 2001లో మైకేల్ ఓవెన్ తర్వాత 25 ఏళ్ల విరామానికి ఓ ఇంగ్లాండ్ ఆటగాడికి ఈ అవార్డు దక్కినట్లుగా పేర్కొంది.
మహిళల బాలన్‌డోర్ అవార్డును స్పెయిన్ స్టార్ అలెక్సియా పుటెల్లాస్ మూడోసారి గెలుచుకున్నట్లు సమాచారం. గతంలో 2021, 2022లోనూ ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గత సీజన్‌లో 53 మ్యాచ్‌లు ఆడి 26 గోల్స్ సాధించిన అలెక్సియా.. మహిళల ఛాంపియన్స్ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచినట్లు కథనం వెల్లడించింది. మరోవైపు, హ్యారీ కేన్ ఈ అవార్డు సాధించినందుకు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపినట్లు పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!