

పులివెందులలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయంగా చెక్ పెడతామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థి గీతకు మద్దతుగా స్థానిక పూలంగళ్ల సెంటర్‌లో నిర్వహించిన కూటమి నేతల సభలో ఆయన మాట్లాడారు. పులివెందులకు పక్కా వ్యూహంతో వచ్చామని, దాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కారు’తో పులివెందులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతల రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన విమర్శలు చేశారు.
పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి మాట్లాడుతూ.. నామినేషన్ల ఏకగ్రీవాల విషయంలో జగన్ వ్యాఖ్యలను ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలపై ఆయన ఏమంటారని నిలదీశారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడాన్ని తట్టుకోలేకే వైఎస్సార్‌సీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనను వేధించినా భయపడబోనని స్పష్టం చేశారు. పులివెందుల ప్రజలు జగన్‌కు తగిన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేస్తున్నానని ప్రజలు చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. పులివెందులలో 3,500 మందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించే బాధ్యతను కూటమి నేతలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!