

టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ.. ఇటీవల సాధించిన శతకంతో వాటికి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీపై అతడి స్నేహితుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2016తో పోలిస్తే కోహ్లీ ఇప్పుడు మరింత మెరుగ్గా ఆడుతున్నాడని, మైదానంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిలో ఈ మార్పును గమనించినట్లు తెలిపాడు. అభిమానులకు పెద్దగా తెలియని కోహ్లీలోని మరో కోణం ఇప్పుడు బయటపడుతోందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ ఎంతకాలం క్రికెట్ ఆడతాడో చెప్పలేనని, అయితే ప్రస్తుత ఫామ్‌లో అతడు మరింత ప్రమాదకరంగా మారాడని డివిలియర్స్ అన్నాడు. కోహ్లీ దూకుడుగా ఆడితే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కష్టమని పేర్కొన్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే 2027 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు అతడు కీలకంగా మారగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం యువ క్రికెటర్లకు గొప్ప అవకాశమని, అతడి అనుభవం నుంచి వారు ఎంతో నేర్చుకోవచ్చని డివిలియర్స్ వివరించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!