

హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సహాయ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్, సెకండ్ హీరో పాత్రల్లోనూ నటించిన అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్, ప్రస్తుతం త్రిగుణ్‌గా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తమిళనాడులో పుట్టి పెరిగిన త్రిగుణ్.. జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ‘కథ’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘పీఎస్వీ గరుడ వేగ’, ‘మనసుకు నచ్చింది’, ‘24 కిసెస్’, ‘డియర్ మేఘా’, ‘WWW’, ‘కొండా’, ‘ప్రేమ దేశం’, ‘డెవిల్’, ‘లైన్ మ్యాన్’, ‘ఉద్వేగం’, ‘మనమే’, ‘జిగిల్’ తదితర చిత్రాల్లో నటించాడు.
ప్రస్తుతం త్రిగుణ్ నటించిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’లో సెకండ్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విషయానికొస్తే.. 2023లో నివేదితను వివాహం చేసుకున్న త్రిగుణ్‌కు గతేడాది ఓ కుమార్తె జన్మించింది. బిగ్ బాస్‌లోకి అడుగుపెడుతూ ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు ఇంటింటికీ తెలిసే పేరు కావాలి’ అనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. తన కొత్త దశను ‘త్రిగుణ్ 2.0’గా అభివర్ణించాడు. మరి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!