

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తాజా ఎపిసోడ్‌లో హోటల్ టాస్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో కంటెస్టెంట్లను మూడు బృందాలుగా విభజించారు. ఎల్లో లెవల్‌లో ఉన్నవారు హోటల్ ఓనర్లుగా, రెడ్ లెవల్‌లో ఉన్నవారు వర్కర్లుగా, గ్రీన్ లెవల్‌లో ఉన్నవారు అతిథులుగా వ్యవహరించారు. అతిథులు సేవలు నచ్చిన వర్కర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు, ఆతిథ్యం నచ్చిన ఓనర్లకు స్టార్స్ అందించవచ్చు. ప్రతి ఓనర్‌కు రూ.10 వేల చొప్పున కేటాయించగా, ఆ డబ్బుతో వర్కర్లను నియమించుకొని అతిథులను మెప్పించాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినవారికి పైస్థాయికి చేరుకునే అవకాశం కూడా కల్పించారు.
టాస్క్‌లో దేబ్జానీ ధనవంతురాలిగా, ముకేశ్ ఆమె ప్రియుడిగా నటించారు. వీరిద్దరి మధ్య గొడవ రావడంతో దేబ్జానీ భావోద్వేగానికి గురై ఏడ్చింది. మరోవైపు వర్షిణి, అమన్ మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా సాగింది. ముకేశ్, వర్షిణి ముద్దు పెట్టుకున్నట్లు చూపించే ఫొటోను బిగ్‌బాస్ ప్రదర్శించడంతో హౌస్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై దేబ్జానీ, అమన్ తీవ్రంగా స్పందించారు. స్టార్స్ సంపాదించేందుకు కొందరు కంటెస్టెంట్లు వ్యూహాలు రచించగా, మరోవైపు నిర్వహించిన కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ టాస్క్‌లో వర్షిణి, రోహిత్ జంట విజయం సాధించింది. ఇలా తాజా ఎపిసోడ్ ప్రేమ, గొడవలు, పోటీలతో ఆసక్తికరంగా సాగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!