

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విజయాన్ని తెలియజేస్తూ ‘బ్లాక్‌బస్టర్’ ట్యాగ్‌తో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

మరోవైపు, అమెరికాలోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు అక్కడ 8.5 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం $1 మిలియన్ మార్కును దాటే అవకాశం ఉంది. ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!