

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మిడ్ వీక్ ఎలిమినేషన్లతో షో ఆసక్తికరంగా సాగుతోంది. ఫిజికల్ టాస్క్‌లో రామకృష్ణను ఓడించి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్.. ఒక్కరోజు మాత్రమే ఉండి రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకుని స్వచ్ఛందంగా బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయంపై బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ మిథిలేష్‌ను ప్రశ్నించారు. ఇంత త్వరగా బయటకు రావాల్సిన అవసరం ఏముందని అడుగుతూ పలు ప్రశ్నలు సంధించారు.
అయితే మిథిలేష్ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నాడు. ఆ వారం ‘టెంప్టేషన్’ థీమ్ కావడంతో ఇలాంటి ఆఫర్ వస్తుందని ముందుగానే ఊహించానని, కానీ రూ.15 లక్షలు ఆఫర్ చేస్తారని మాత్రం అనుకోలేదని చెప్పాడు. ఈ మొత్తాన్ని విజేత ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తారని భావించినందువల్ల రూ.15 లక్షలకు అంగీకరించడం సరైన నిర్ణయమే అనిపించిందని వివరించాడు. తాను ఈ డబ్బును ఊరికే తీసుకోలేదని, అగ్నిపరీక్షతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కూడా పోరాడానని పేర్కొన్నాడు. తాను హౌస్‌లో కొనసాగినా ఆరో లేదా ఏడో స్థానం వరకు మాత్రమే వెళ్లే అవకాశం ఉందని భావించానని, అందుకే తన నిర్ణయాన్ని ఇప్పటికీ ‘స్మార్ట్ ప్లే’గానే భావిస్తున్నానని మిథిలేష్ స్పష్టం చేశాడు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!