

‘అగ్నిపరీక్ష’ మొదటి సీజన్ విజయవంతం కావడంతో రెండో సీజన్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వివాదాలు, కంటెస్టెంట్ల వ్యాఖ్యలతో ‘అగ్నిపరీక్ష 2’ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ షోలో రాజకుమారి డయానాకు మంచి గుర్తింపు, ఫాలోయింగ్ లభించాయి. తన జీవిత కథతో జ్యూరీని ఆకట్టుకున్న ఆమె మూడు గ్రీన్ సిగ్నల్స్ అందుకుని నేరుగా టాప్ 15లో చోటు సంపాదించింది. టాస్కుల్లోనూ చక్కగా రాణించి గ్రీన్ బ్యాడ్జిలు దక్కించుకోవడంతో ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం ఖాయమని చాలామంది భావించారు. అయితే చివరకు ఎంపికైన కంటెస్టెంట్ల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు.
బిగ్ బాస్ అవకాశం రాకపోవడంతో రాజకుమారి డయానా ప్రస్తుతం జబర్దస్త్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో అప్పుడప్పుడు ఈ షోలో కనిపించిన ఆమె.. ఇప్పుడు నూకరాజు టీంలో కొనసాగనున్నట్లు సమాచారం. ఇకపై స్టార్ మా ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల్లో ఆమెకు అవకాశాలు వస్తాయా? లేదా? అనేది చూడాలి. మరోవైపు అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్‌లోకి వెళ్లిన మహిళా కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆర్కే, రోహిత్ వంటి కంటెస్టెంట్లపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు కూడా అందుకోలేకపోయారు. రోహిత్ రీ ఎంట్రీపై కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!