

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తెలుగు కామెడీ సీరియల్ ‘అమృతం’ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 25 ఏళ్ల క్రితం టెలివిజన్‌లో ప్రారంభమైన ఈ నవ్వుల ప్రయాణం ఇప్పటికీ ప్రేక్షకుల ఇళ్లలో కొనసాగుతూనే ఉందని సీరియల్ బృందం ఆనందం వ్యక్తం చేసింది. తరాలు మారినా, కాలం మారినా ‘అమృతం’పై ప్రేక్షకుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని పేర్కొంది. ఇందులోని పాత్రలన్నింటినీ తమ ఇంటి మనుషులుగా భావిస్తూ పాతికేళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా ‘అమృతం’ బృందం భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. తమతో కలిసి నవ్వుతూ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. ఈ వేడుక కేవలం సీరియల్ బృందానిదే కాకుండా, ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరిదని పేర్కొంది. ‘అమృతం మీది.. ఈ సంబరం మనందరిదీ’ అంటూ 25 ఏళ్ల విజయోత్సవాన్ని అభిమానులతో పంచుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!