

బిగ్‌బాస్ సీజన్ 10లో 32వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యేందుకు కంటెస్టెంట్లు జంటలుగా పలు గేమ్స్‌లో పోటీపడ్డారు. ‘స్టెప్ రోల్ గోల్’ టాస్క్‌లో అమన్ జంట మొదటి స్థానంలో నిలిచి 100 పాయింట్లు సాధించింది. రాంప్రసాద్ జంటకు 80, ముకేశ్ జంటకు 60, షాలిని జంటకు 40, అపూర్వ జంటకు 20 పాయింట్లు లభించాయి.
గేమ్ సమయంలో రోహిత్, షాలిని, రాంప్రసాద్, అమన్ మాట్లాడుకుంటున్న సమయంలో అపూర్వ అక్కడికి రావడంతో రోహిత్ ప్రైవసీ ఇవ్వాలని కోరాడు. దీంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత రోహిత్ ఈ విషయంపై అపూర్వతో మాట్లాడగా, షాలిని కూడా మధ్యలోకి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో రోహిత్ అమన్‌కు కూడా షాలినిని రెచ్చగొట్టవద్దని సూచించాడు.
అనంతరం వర్షిణి, ముకేశ్ కలిసి నరేశ్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి తీసుకెళ్లడంతో ఇంట్లో సందడి నెలకొంది. తర్వాత లీడర్‌బోర్డులో అమన్, త్రిగుణ్ జంట 180 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో వీరిద్దరూ నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. మరోవైపు మిగిలిన జంటలు తమ స్థానాలను మెరుగుపరుచుకునేందుకు తదుపరి టాస్క్‌లో పోటీపడ్డాయి.
‘చిత్రం భలారే విచిత్రం’ టాస్క్‌లో కంటెస్టెంట్లకు స్క్రీన్‌పై కొన్ని బొమ్మలను క్రమపద్ధతిలో చూపించారు. సంచాలకులు చెప్పిన నంబర్ల ఆధారంగా ఆ బొమ్మలను బోర్డుపై గీయడంతో పాటు, డార్క్ యార్డ్‌లోని సంబంధిత వస్తువులను గుర్తించి సర్కిల్‌లో ఉంచాల్సి వచ్చింది. ఈ టాస్క్ సమయంలో ఝాన్సీ, షాలిని మధ్య చీటింగ్ అంశంపై వాగ్వాదం చోటుచేసుకుంది. రోహిత్, షాలిని కూడా గేమ్ నిర్వహణపై సంచాలకులతో చర్చించారు.
మూడో టాస్క్ ముగిసే సమయానికి రాంప్రసాద్, నరేశ్ జంట 220 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అపూర్వ, చరణ్ జంట 200 పాయింట్లతో రెండో స్థానంలో, ముకేశ్, ఝాన్సీ 160 పాయింట్లతో మూడో స్థానంలో, రోహిత్, షాలిని 140 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. మొత్తంగా గేమ్స్, వాగ్వాదాలు, సేఫ్ అయిన కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10వ సీజన్ తాజా ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!