

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ పదో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం దీపావళి సందర్భంగా ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని బిగ్‌బాస్ ముందుగానే హెచ్చరించాడు. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా ఇంట్లో కొనసాగడానికి అర్హత లేని వారిని గుర్తించాలని సభ్యులకు సూచించాడు. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు నామినేషన్లు చేసుకున్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి కెప్టెన్ వంశీ మినహా ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.
దీంతో ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ మాస్టర్, దేబ్జానీ, రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, శ్వేత, శివకుమార్, త్రిగుణ్, రామకృష్ణ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వారం డబుల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ముఖేష్ ముందంజలో ఉండగా, త్రిగుణ్ రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దేబ్జానీ, అమన్, జబర్దస్త్ నరేష్, రాంప్రసాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు గత వారం ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న నీతూ మాస్టర్, సుధీర్ ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శివకుమార్ కూడా ప్రమాదంలో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరిగా కనిపిస్తున్నాడు. అయితే ఇవన్నీ అనధికారిక ఓటింగ్ అంచనాలు మాత్రమే. ఓటింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!