

కెప్టెన్సీ టాస్క్‌లో అమన్ కీలక దశలో విజయం సాధించడంతో అతనే కెప్టెన్ అవుతాడని భావించారు. అయితే వర్షిణి తనకు ఉన్న ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్‌ను ఉపయోగించి అమన్ సాధించిన విజయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. దీంతో వర్షిణి కెప్టెన్‌గా నిలిచింది. ఈ పరిణామం అమన్‌ను నిరాశకు గురిచేయడంతో పాటు ఇప్పటికే అమన్, త్రిగుణ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు మరింత ప్రాధాన్యం వచ్చింది.
మరోవైపు డ్యాగర్స్, ఇమ్యూనిటీ గేమ్ కూడా హౌస్‌లో సమీకరణాలను మార్చింది. సుధీర్, వంశీ ఇమ్యూనిటీ సాధించి నేరుగా ఆరో వారంలోకి వెళ్లే అవకాశం పొందారు. దీంతో టీమ్‌ల మధ్య పోటీతో పాటు వ్యక్తిగత వ్యూహాలు, గ్రూపుల సమీకరణాలు, టార్గెటింగ్ అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ కంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ తరహా సమీకరణాలు కనిపిస్తున్నాయా అనే చర్చకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!