
గాసిప్స్

నటి తేజస్వి మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు సీజన్ 3 తాజా ప్రోమో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ ఎపిసోడ్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి (ఈషా బ్లాగ్స్), మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ నైనిక అతిథులుగా పాల్గొన్నారు. సరదా గేమ్‌లో సందీప్ కిషన్ ఫొటో రావడంతో మౌనీషా చెప్పిన ఫన్నీ ఫాంటసీ, తేజస్వి చేసిన చమత్కార వ్యాఖ్యలు ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అదే ఎపిసోడ్లో సిద్ధు జొన్నలగడ్డపై నైనిక చెప్పిన సరదా ఫాంటసీ కూడా ప్రేక్షకులను అలరించింది. షోలోని ఫ్రీ-ఫ్లో సంభాషణలు, కామెడీ పంచ్‌లు కొందరిని ఆకట్టుకోగా, మరికొందరు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎపిసోడ్‌పై ఆసక్తిని మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!