
న్యూస్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. సభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు.
రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతల పరిస్థితిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. తమకు తగిన గౌరవం, ప్రజా సమస్యలను ప్రస్తావించే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!