
సినిమాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ రౌడీల దాడికి గురై తీవ్ర నష్టం చవిచూసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ధ్వంసమైన ఆఫీస్, ఇంటిని పరిశీలించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు.
అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న వైయస్ జగన్, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ పర్యటనల వివరాలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు. టీడీపీ గూండాల దాడులను ఖండిస్తూ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!