
జనరల్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచినా, విజయ్ రెండు చోట్ల పోటీ చేయడంతో సాంకేతికంగా పార్టీ బలం 107కి తగ్గింది. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో ప్రస్తుతం టీవీకే బలం 112కు చేరింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన 117 మెజారిటీకి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరంగా మారింది.
ఇక రెండు చొప్పున స్థానాలు గెలుచుకున్న సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు నేడు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు తమ కార్యాలయాల్లో కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. మరోవైపు వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్తో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలతో విజయ్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!