

పదేళ్లకు పైగా క్రితం సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అసమాన ఆస్తుల కేసుల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. ముఖ్యంగా జగన్ 2019 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసుల్లో చలనం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు, ఎన్నేళ్ల తర్వాత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో నవంబర్ 21 కి ముందు హాజరుకానున్నారని సమాచారం. సెక్యూరిటీ కారణాలు, ఇతర సాకులు చెబుతూ జగన్ ఈ విచారణకు ఎన్నేళ్లుగా దూరంగా ఉన్నారు.
గత నెల లండన్ వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పుడు, నవంబర్ 14 లోపు కోర్టుకు హాజరవుతానని జగన్ అంగీకరించారు. కానీ తర్వాత ఆయన మళ్లీ వర్చువల్ హాజరు లేదా లాయర్ ద్వారా ప్రాతినిధ్యం వహించాలనే అభ్యర్థన చేశారు. దీనిపై సీబీఐ తీవ్రంగా స్పందించి కౌంటర్ దాఖలు చేసింది. ఆ తరువాత జగన్ మరో వారం సమయం కోరగా, నవంబర్ 21 లోపు కోర్టుకు హాజరవుతానని అంగీకరించారు. ఎన్నేళ్ల తర్వాత జగన్ నాంపల్లి కోర్టులో ప్రత్యక్షమవుతుండటంతో ఈ పరిణామం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!