

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణం మళ్లీ పుంజుకుంటోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిన పరిస్థితి ఇప్పుడు మారుతోంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో, 2019 లో ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక ప్రముఖ సంస్థ రేపు ఆంధ్రప్రదేశ్‌లోకి తిరిగి వస్తోందని సంకేతాలు ఇచ్చారు. ఆ కంపెనీ పేరును ఊహించమని ఆయన నెటిజన్లను ఆహ్వానించగా, రేపు ఉదయం 9 గంటలకు ఆ సస్పెన్స్‌ను విప్పుతానని తెలిపారు.
లోకేశ్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో రాష్ట్రంలో మళ్లీ విశ్వాసం నెలకొంటోందని అన్నారు. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపెల్టన్, లులు గ్రూప్, జాకీ వంటి సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి రావాలనుకుంటున్నాయని సమాచారం. ఇప్పటికే ఇన్ఫోసిస్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. రేపు వెలువడబోయే ఈ పెద్ద ప్రకటన రాష్ట్ర అభివృద్ధి పునరుజ్జీవనానికి మరో మైలురాయిగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!