
సినిమాలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టణ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. గత పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలని, అలాగే గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పాలనను గమనించి భవిష్యత్‌ను అంచనా వేయాలని ఆయన కోరారు.
కేంద్రంలో మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తెలంగాణకు ఉపయోగపడే పనులు చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి వినతులు చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుతో నిలిచిన అభ్యర్థులకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!