
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మొత్తం 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటుడు విశాల్
వీడియో విడుదల చేస్తూ విజయ్ నిర్ణయాన్ని అభినందించారు. పాఠశాలల సమీపంలోని మద్యం దుకాణాల వల్ల విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నిర్ణయం గొప్ప మార్పుకు నాంది అవుతుందని అన్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమిళ ప్రజలు ఎప్పటినుంచో ఇలాంటి చర్యలకోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!